ఓమ్ నమ:శ్శివాయ నమ:


మేమెంత చేశామని నీ పూజలు…
ఎంతెంత చేశామని నీ సేవలు..
కాచేవుగా శంకరా రేపవలు భక్త జనులను…
తీర్చేవుగా గంగాధరా…మా ఈతిబాధలను…!!మేమెంత!!
ప్రేమ లొలికే నీ కనులు మా పుణ్యాల గనులు…
దొరకవెవ్వరికి కురిపించినా కోట్ల వరహాల సిరులు…
దాగి ఉన్నయయా ఆ కనులలో కరుణ నిధి నిక్షేపాలు..
వేచిఉన్నాయవి ప్రసరింప మా పైన తొలగ మాకున్న పాపాలు…!!మేమెంత!!
తలరాతనే మార్చగల తండ్రివని తెలిసి…
ఈ ధరణి పై నీ ఘోర తపములే చేసి…
నీ మదిన కాసింత చోటునే పొందమా…
ఈ భువిని ఆ దివిగ చేయమని కోరమా…
భూలోకమవ్వాలి కైలాసము..
ఇల కైలాసమవ్వాలి నీ నివాసము..
పాహిమాం… పాహిమామ్…పరమేశ్వరా పాహిమామ్..
రక్షమామ్..రక్షమామ్..సర్వేశ్వరా రక్షమామ్..