ఏమాయెనో శంకరా ఈ తనువుకి..

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

ఏమాయెనో శంకరా ఈ తనువుకి..
నీ తలపులే చేరే గుండెలో ప్రతి మూలకి…
ఎద నీ గుడి గోపురమాయెరా హర హరా ఈపూట..
మది పరివర్తనము చెంది పాడింది నీ భక్తి పాట..
ఈ అనుభూతులనిట్లే నాలోన కొనసాగనీ…
పదకీర్తనల సరిగమలతో నీ మనసు దరి చేరనీ…
పార్వతీ పరమేశ్వరం…నమో నమామి…
గౌరీ మహేశ్వరం..సదాస్మరామి!!ఏమాయెనో!!

రాగాల యాగాలతో రంజింపచేసేను..
అసమాన సాహితీ కుసుమాలతో పులకింపజేసేను…
ప్రసరించుతుంటే  ప్రేమ పరిమళ సుగంధము..
తిలకించనా నీ ముగ్ధ ముఖారవిందము..
మరచిపోయి.. నన్ను నేను మనిషినని.. ధ్యానించనీ
గడచి పొనీ నీ సేవలోనే ఈ శేష జీవితాన్ని!!ఏమాయెనో!!

ఆకాశమంత మనసు నీదని
అవకాశమిస్తావు వేడుకొమ్మని..
అండగా వుంటాను ప్రతి క్షణమని
సూచిస్తుంటావు నను నమ్మని
ఏకాగ్రతే లేని మా భక్తికి..
అర్ధమవదయా నీ తత్వము ఎన్నాళ్ళకి…
శంకించక చూపరా నీ కరుణని..
సుమములై చేరేము నీ పాద పద్మాల చెంత శరణం అని…!!ఏమాయెనో!!

పాహిమామ్..పాహిమామ్..పరమేశ్వరా పాహిమామ్..రక్షమామ్..
రక్షమాం  సర్వేశ్వరా రక్షమాం

Leave a Comment

Scroll to Top