ఓమ్ నమ:శ్శివాయ నమ:

03.10.2021
శంకరా.. నీ దివ్య ఓంకార నాదం..
సంగీత సాహిత్య కళలకది శబ్ధవేదం..
ప్రకృతి ఒడిలోన వినిపించు నిత్య నీ ప్రణవనాదం..
దుష్టగ్రహరాశులకది సింహా నాదం..
వరమాయరా శంకరా..ఈ పుడమికి
భక్తి బీజాక్షరమాయెరా…నీ పూజకి!!శంకరా!!
నిర్మలమవును మనసు
ఓంకార శబ్ధమును పలుకుతుంటే…
కైలాసమే కనిపించును..
ఉచ్చ్వాస నిశ్వాసముల నడుమ ప్రతిధ్వనిస్తువుంటే…
సాక్షాత్కరించినట్లుంటావు..మా కనుల ముందర…
కనులు తెరవగనే కనిపించవు ఎందుకయా నీకంత తొందర…
పరిపూర్ణభక్తితో ప్ర్రార్ధించెదము శంకరా…
సపరివార సమేతముగ విచ్చేయరా మరోమారు హర హరా…
పాహిమాం…పాహిమామ్..శివశంకరా పాహిమాం…
రక్షమాం..రక్షమాం..అభయంకరా రక్షమాం..