నాగాభరణ దేవ నాగలింగేశ్వరా…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

నాగాభరణ దేవ నాగలింగేశ్వరా…
గౌరీవర దేవా  కాళలింగేశ్వరా…
దయచూడవయా దీనదయాళా…
కరుణించవయా శ్రీ మహాకాళా…!!నాగా!!

పెడదారిలో పయనించు ఏ పాపాత్ముడైనా నీ మాయలో పడితే కాడా శివా ధర్మాత్ముడు…
కారుణ్యమన్నదే లేని ఏ కఠినాత్ముడైనా నీ కరుణతో కడతేరి కాడా శివా పుణ్యాత్ముడు..
దుర్మార్గులెందరో సన్మార్గులైనారు భక్తితో వారు నిను పూజించి…
మానవులెందరో మహాత్ములైనారు రేపవలు నీ సేవలో తరించి..!!నాగా!!

పుణ్యాలు ఉట్టిపడే నీ కంటి కిరణాలతో..
వైదొలగవా జన్మ జన్మల పాపాలు నిను కొలిచితే ఆర్తితో…
దర్శించితే చాలు..కట్టిపడేయు నీ అలంకారముతో…
దాక్షాయనీ పతీ..దరిచేర్చుకుంటావు  తండ్రివై మమకారముతో…
మరువగలమా నిను మేము మల్లికార్జునా..
నీ ప్రేమ లోతులు ఎరుగ గలమా మేము ఎన్ని జన్మలైనా…

పాహిమామ్…పాహిమామ్..    ప్రేమస్వరూపాయా శివా పాహిమామ్..
రక్షమామ్..రక్షమామ్..సర్వలోక రక్షకాయా రక్షమామ్..

Leave a Comment

Scroll to Top