ఉన్నాము రా శివా… నేలపై ఉండీలేనట్లుగా…

ఓంనమ:శ్శివాయనమ:🙏🙏🙏

 ఉన్నాము రా శివా… నేలపై ఉండీలేనట్లుగా…
బ్రతికిఉన్నాము రా శివా… భూమిపై నువ్వున్నావని అండగా..  
క్షణమైన వీడకురా మా చేయి శంకరా…
నీ చంటి బిడ్డలం రా శివా…పట్టు విడకోయి శంకరా…

ఆర్తిగ చూసేము శివా నీ కళ్లనీ..
నీ మది తలుపులు తెరిచే ఆ వాకిళ్లని…
పరిచామురా శివా… నీ ఎదుట మా జీవితపు కాగితము..
తప్పులుంటే సరిదిద్దరా శివా..చేస్తాము మా జీవితము నీకంకితము..
ఎద భారమైన వేళ ఎదురుగా నువ్వుండరా శివా…
వ్యధ దూరమవువరకు నీడగా  
తోడుండరా శివా…
ఏరువాక రాకకై ఎదురు చూసేటి రైతులై…
నీ కరుణ వాన బొట్టుకై నింగికేసి చూచు చేలమై…
ఆశతోనే మేమెపుడూ బ్రతుకుతున్నామయా  శివా…
నీ ఆశీస్సులు ఉంటాయని నిన్నెపుడూ నమ్ముకొని ఉన్నామయా  శివా…

పాహిమాం..పాహిమాం..శివశంకరా పాహిమాం…
రక్షమాం…రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం..

Leave a Comment

Scroll to Top