ఓమ్ నమ:శివాయ నమ:


కలడు శివుడని మేము నిన్ను తలచామయా…
కరుణించు వాడు హరుడని నిన్ను కొలిచేమయా…
వినిపించలేదా శివా.. భువి లోని ఈ ఆర్తనాదాలు…
రక్షించుటందుకు కదలవెందుకు రా శివా. నీదు పాదాలు…
రారా శివా… కదలి రారా శివా…
కన్నీటి కడలైన అవనిని కనరా శివా..
కావచ్చు మేము పాపాత్ములం..
దండించు తీరిదా శివా? అని
నిన్నెటుల అడగగలం…
ఏ జన్మ పాపమొ ఈ జన్మ శాపమై
అయ్యాము మేము శిక్షార్హులం…
అందుకే మన్నించమని కోరేము ప్రతిదినము మేము…
మరుజన్మ వద్దని పాదాలపై పడి వేడుకొనెదెము మేము..
ఒక సారి వినరా శివా…మా హృదయ వేదనలు…
దయతలచి గైకొనరా శివా…మా కన్నీటి నీవేదనలు…
లోక కళ్యాణము కోరు లొకనాధుడా…
ఈ కల్లోల మాపి రక్షించు దేవుడా..
పాహిమాం…పాహిమాం..శివశంకరా.
రక్షమాం…రక్షమాం..అభయంకరా…