గౌరమ్మ తల్లి వరాల కొండా…
వేయి వందనాలయా నీకు వక్రతుండా…
విఘ్నములను కడతేర్చు విఘ్నేశ్వరా…
విపత్తుల నుండి కాపాడ జాగేలరా…
శివ పార్వతుల వరదీవెనల పుత్రుడివి…
ఆది దంపతుల ప్రేమ పాత్రుడివి…
అందుకోరా గణేశా..ఆదివ్యమూర్తుల శక్తులని…
తెగనరకరా విఘ్నేశా కరోనా రక్కసి కోరలని…
ఆనంద నయనాల తో అలరారనియ్యరా జగము…
మహదానందముగ మనగలగనియ్యరా మహిలోన జనము…
లోకేశ్వరుని సుతునివై లోకమును పాలించు…
పరమేశ్వరుని వరమై మామది లోన నివసించు….
పాహిమాం…పాహిమాం….
గణనాయకా…
రక్షమాం..రక్షమాం..సిద్ధి వినాయకా…