ఏ భావమీ రూపము గంగాధరా…

ఏ భావమీ రూపము గంగాధరా…
సంభవమా మాకు వివరించ గౌరీవరా..
సాక్షాత్కరిస్తావు వివిధ రూపాలతో..
కరుణించవస్తావు బహుళ భావాలతో…

 దినమున కొక సారి నిను దర్శించు భాగ్యము నివ్వు….
క్షణమున కొకసారి నిను స్మరించు వరము నివ్వు…
కావాలి శివా అదే మా దైనందిన జీవితం…
గడచిపోవాలి శివా ఈ జీవితం నీ సేవలోనే మరచి తన గతం..
సుందర సుకుమార కుసుమాలతో నీ పాదాలు తాకి పునీతుడనవనా శివా…
సుమధుర దోర ఫలముల నివేదనలనిచ్చి జన్మచరితార్థుడనవనా శివా…
నాకు తెలిసిన దారిదేరా నీ దయకన దయాళా…
నేనెరిగిన మార్గమిదే  పూజించుటే నిను ప్రతి సంధ్యవేళ…
దీవించరా శివా…కరుణించరా శివా..
పాహిమాం..పాహిమాం..శివశంకరా…
పాహిమాం…అన్న మాటా ఎన్నడూ మరవమయా…పాహిమాం..శివా..పాహిమాం..

Leave a Comment

Scroll to Top