పుట్టించెదవు ఎందుకో…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏02.10.2021

పుట్టించెదవు ఎందుకో…
కర్మలు చేయించెదవు మరెందుకో..
అర్ధమవవు శంకరా…నీ లీలలు
దిద్దుకొన తగవు…మా నుదుటి పై ఆ బ్రహ్మ రాసిన రాతలు…!!పుట్టించెదవు!!

సాన పెట్టగ మా హృదయగుణమును సకల భోగముల నిత్తువు…
నీ మర్మమెరుగని ఈ సగటు బ్రతుకు పెడదారి పట్టి నడుచును…
జన్మ పరమార్ధము తెలియకున్నది..
కర్మ ఫలము ఎట్లుండునో ఎరుగకున్నది..
నడచుచున్నవి మా జీవితాలు పట్టు పరుపని నిన్ను మరచి పల్లేరు కాయల  దారిపై..
దృష్టి పెట్టకున్నవి..ఒక్క క్షణమైనా మనసుతో ధ్యాసగా ముక్తి కోరగ నీ మూర్తిపై..!!పుట్టించెదవు!!

కొండ కోనలు నడచిరామా…
వాగు వంకలు దాటిరామా..
ఎక్కడుంటవొ చెప్పు జంగమా…
ఈ చిక్కుముడినిక విప్పు లింగమా..
సంశయాలకి తావు నివ్వక..
సావధానముగ మనసు కెక్క..
ఈసృష్టి రహస్యము చెప్పవయ్యా…
నీ దృష్టి సదా మాపై ఉంచవయ్యా…

పాహిమాం… పాహిమాం… పరమేశ్వరా…పాహిమాం…
రక్షమాం…రక్షమాం..సర్వేశ్వరా. .రక్షమాం..

Leave a Comment

Scroll to Top