ఓమ్ నమ:శ్శివాయ నమ:


ధవళ వర్ణ రూపమా…
అమరనాధ లింగమా..
మంచుకొండల జంగమా…
దీవించి సరుగున మము పంపుమా!!ధవళ!!
నిను దర్శించుకొని పొందిన మా భావనలు పదిమందితో కలిసి పంచుకోవాలి..
అది తెలుసుకొని ఆ పదిమంది వందమందితో కలిసి కదలి రావాలి..
వందలు వేలైన భక్తులతో నీ గుడులన్ని నిండి పోవాలి…
“శంభో శంకరా” అను శుభ ఘోషణలతో నీ కోవెలలు మ్రోగిపోవాలి…
ఆ శబ్ద ప్రభంజన జడివానకు తడిసి నీ మనసు పరవశించి
పొంగిపోవాలి….
అది చూసి మాకనులు నీ పాదాలు కడగంగ పాలకడలు లవ్వాలి..!!ధవళ!!
ఉప్పొంగు భక్త జన సంద్రమును గాంచి తన్మయత్వముతో నువ్వూగి పోవాలి…
ఆ సంతోష సమయాన ఆనంద తాండవము చేస్తూ అవనికి ప్రేమను పంచుతూ చెలరేగిపోవాలి…
బాధా తప్త హృదయాలని తాకాలి నీ ప్రేమ కిరణములు….
ఊహించని వరముతో ఉపశమనము పొంది చేరుకోవాలి వారు నీ దివ్య చరణములు…!!ధవళ!!
పాహిమామ్..పాహిమామ్…
పాహిమామ్..
రక్షమామ్..రక్షమామ్..సర్వేశ్వరా