ఓమ్ నమ:శ్శివాయ నమ:


ఓం నమో శివశంకరాయా…
ఓం నమో పరమేశ్వరాయా…
త్రిదళపూజిత దేవ దేవుడవు…
త్రిజన్మ పాప సంహారకుడవు..
అసలేంటి? ముక్కంటి…ఈ “మూడు” సంఖ్య కు గల పరమార్ధము…
వివరించమంటి విశ్వమునకు దీని గూడార్థము…!!ఓం!!
ముప్పూటలా పూజించు మునులైన చెప్పగలరా?..
మూడవ ఝాము నుండే నిను ధ్యానించు బ్రహ్మర్షులైనా వివరించగలరా…
తెలుసుకొనగ దారి చూపించరా శంకరా…
ఆ లోతులెరుగ గల మార్గమును సూచించరా హరహరా…!!ఓం!!
ముజ్జెగములనేలుటకు మూడు కళ్ళ త్రినేత్రువనీ…
మా మూడు జన్మల పాపములను హరించుటకు త్రిజన్మ పాపసంహరి వైనావనీ…
సర్వ కాల సర్వా వ్యవస్థలలో దుష్ట సంహారము గావించుటకు త్రిమూర్తుల శక్తులే త్రిశూలమనీ..
ఏక కాలమున ఏక పత్రము తో బ్రహ్మ,విష్ణు పరమేశ్వరుని పూజించు ఫలమొచ్చు నటుల బిల్వదళమే త్రిదళమనీ…
భావించు చున్నాము భవహరా…
మా భావనలు వివరించి నీకు శంకరా…
పాహిమామ్…పాహిమామ్..శివశంకరా.
రక్షమామ్..రక్షమామ్..అభయంకరా…