అందుకో శంకరా మా నివేదనని…

 ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏


అందుకో శంకరా మా నివేదనని…
అవని కార్చే కన్నీటి వేదనలని…
ఎన్నడూ విననట్టి ఈ దీన గాధలని…
మునుపెన్నడూ కననట్టి మా బ్రతుకు బాధలని…!!అందుకో!!

కరోనా మహమ్మారి మారణహోమానికి..
  ఎందరో బలిఅయినారు కనిపించని ఆ సూక్ష్మజీవి రక్కసి దాహానికి.
 తల్లి చనుబాలు కరువై తల్లడిల్లే బిడ్డలెందరో…
ముద్దు మురిపాలు దూరమై వసివాడిన పసి బిడ్డలెందరో…
అమ్మేది, నాన్నేడని దిక్కులను చూస్తుంటే…
ఆదుకొను వారెవరో తెలియక బిక్కు బిక్కు మంటుంటే…
రారన్న నిజము తెలియని పసికందుల మోము  చూస్తుంటే..
ఇక లేరన్న విషయము చెవిన వేద్దమనుకుంటే…
సుడులు తిరుగుతున్నాయిరా శంకరా…మాకళ్ళలో కన్నీరు…
నవ నాడులు కదులుతున్నాయిరా హరహరా..వింటుంటే ఒక్కొక్క కథ తీరు….!!అందుకో!!

కొరివి పెడతాడని ఆశతో బ్రతుకు తున్నాన్న   ఒక కన్నతండ్రి…
  కడకు తన కొడుకు కడ చూపుకైన నోచుకొనక  శిధిలమయ్యాడు ఆ తండ్రి..
తోడుగుంటాడన్న మొగుడు దూరమై ఒక పడతి…
గూడు చీకటై విలపించే నట్టింట సద్గుణసతి…
కలసి ఏడడుగులేసిన తన ఇంటి ఇల్లాలు..
వదులుతుంటే  తన కళ్లముందే గిల గిలా  ప్రాణాలు..
అన్నదమ్ముల్ని  కాదు..అక్కచెల్లెళ్ళనే కాదు…
ఆప్తులందర్ని కోల్పోయి  ఒంటరిగా మిగిలారు…
అర్ధమవని తలరాత కై కంట తడి పెడుతున్నారు…
ఎందుకేశావయా శివా లోకానికీ ఈ ఘోర శిక్ష…
తట్టుకోలేమయా శివా మేమీ పరీక్ష..
ఆదుకొనగ వేగముగ రా రా శివా…
ఆత్మస్థైర్యము నివ్వగ దిగి రా రా శివా…
పాహిమామ్..పాహిమామ్.  శివశంకరా…
ఈ కష్టముల నుండి గట్టెక్కించరా గంగాధరా…

Leave a Comment

Scroll to Top