మునులైన, జనులైన కడకు యోగులైనా నిన్ను కనగలర  శంకరా?

 ఓంనమ:శివాయ నమ:🙏🙏🙏
 
మునులైన, జనులైన కడకు యోగులైనా నిన్ను కనగలర  శంకరా?
నిప్పుకణములై మెరయు నీ కనులు చూసి మనగలమని చెప్పగలరా శంకరా…
నీ మోములో కను మరుగవగా రౌద్రము…
శ్లాఘించమా భక్తితో మేము  
నీ  రుద్రము…
 
ఆదరించే ప్రభువు ఆగ్రహముగ ఉంటే…
అడుగు టెట్లమ్మ జననీ అభయమి మ్మని తనని, మాట పెగలని చూపులు ప్రసరించుతుంటే..
 
 చల్లని శ్రావణ మాసపు పున్నమి వెన్నెలలా…
మధుమాసపు మాపటివేళ వీచే మల్లెల పరిమళ వీచికలా…
దిగివచ్చి చిందించవమ్మా గిరి రాజ పుత్రీ ఓ చిన్ని చిరునవ్వునీ..
దరి చేరి అందించవమ్మా…
 హే శైలపుత్రీ …..ప్రసన్నుడవు కమ్మని  ప్రేమతో తనకు మందార పువ్వునీ…
చెప్పమ్మ నువ్వయినా మా వెతలు ఓ చండికా…
ఏకమై ఇద్దరూ  శీఘ్రమే మము కావ
కదలి రండి రండిక ….
 
పాహిమాం… పాహిమాం.. పార్వతీశాయ పాహిమాం…
రక్షమామ్…రక్షమామ్…రవిచంద్ర నేత్రాయ రక్షమామ్…

Leave a Comment

Scroll to Top