ఓం నమః శ్శివాయ నమః

ఓం నమః శ్శివాయ నమః 

అనుదినము నీ దర్శనము మాకు అరుదైన వరమే కదా శివా…
ప్రతి క్షణము నిను తలవని ఏ ప్రాణైన ఇలపైన కలదా శివా….
విశ్వవ్యాప్తమైన నీశోభాయామానాలు…
మము కాపాడుతుంటాయి ఉదయాస్తమానాలు…
పాహిమాం…పాహిమాం..శివశంకరా…
పరమ పావనమైన నీ చరణాలే మాకు శరణంటి రా…

మెడలోన మిన్నాగు బుసబుసలతో
నీ నామమే స్మరియించునురా…
తలపైన గంగమ్మ తన గల గల లతో
ప్రణవనాదములే పలికించునురా…

ఒక్కన్ను రవికిచ్చావు వెలుగునిమ్మని..
ఒక్కన్ను చంద్రునికిచ్చావు హాయినిమ్మని…
ముక్కన్ను తో మూడు లోకాలనేలేవు…
ముష్కరులను తుద ముట్టించేవు…
మౌన మునిలా వుంటావు మము కాపాడుతూ….
ధ్యాన మునిలా వుంటావు ఓవైపు మాపైన ధ్యాస పెడుతూ…
ఏ పాటి పూజచేశామయా శివా నీకు…
ఇంతటి ఫలమిచ్చావు శివా మాకు…
నిను వదలక పూజింతునని నా మనసు తీర్మానించుకున్నది శివా…
నన్నడగకనే నిను సేవించుటకు నీ గుడిని తనలోన తానే నిర్మించుకున్నది శివా…

పాహిమాం..పాహిమాం..శివా…
పదిలముగ మది మందిరములోనే
నిలిచి రక్షించవయా శివా…

Leave a Comment

Scroll to Top