అడుగు నా మదిని ఎపుడైన శంకరా…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

అడుగు నా మదిని ఎపుడైన శంకరా…
తలచు నీ నామమేనని చెప్పు.. హర హరా
వెలుగు నీ జ్యోతి హృది లోన కనరా..
ఆ వెలుగు నీడలో బ్రతుకుతున్నాము భవహరా..!!అడుగు!!

రాతిరంతా నిదురరాదాయె శివా..తెలవారగనె ఎపుడెపుడు నిను దర్శించగలనని…
నిదురలేచాక  తెలిసేనయా నిను దర్శించుటకు బహుమతిగా ఒక దినమును అదనముగ ఇచ్చావని…
కోరకనే ఇస్తావు కాత్యాయిని పతీ అందరికీ ఈ కానుక…
సఫలీకృతము చేసుకొని సాగమని నీ సేవలో చివరిదాకా..!!అడుగు!!

మనసాగక అడుగుతున్నాను శంకరా…సందేహమును తీర్చమని..
ధ్యానముద్రుడివై నిత్యమూ నువు ధ్యానింతువు ఎవరినని…
ఆది మధ్యాంతరహిత ఆదిశంకరా తెలుపరా…
ఆ చిదంబర రహస్యమేదో కలనైనా చెప్పరా…

పాహిమామ్..పాహిమామ్..శివశంకరా పాహిమామ్..
రక్షమామ్..రక్షమామ్..సర్వేశ్వరా రక్షమామ్…

Leave a Comment

Scroll to Top