రారాజువయా శివా..మారాజువయా శివా…
నీ కళ్లలో ఆ దర్పము…అసురలకది శాపము….
మెలివేసిన ఆ మీసము…శత్రువులకు యమపాశము…
మొత్తముగ నీ రూపము…కనినంతనే తొలగు పాపము…
పాహిమాం..పాహిమాం..శివశంకరా…
రక్షమాం…రక్షమాం…అభయంకరా…
ప్రమదగణములు నీకు వందిమాగదులవగా…
ప్రణవనాదములతో జేజేలు పలుకగా…
కైలాస సామ్రాజ్య సింహాసనము ఆహ్వానించగా…
కాత్యాయినీ,ప్రియసుతులతో కలిసి అధిష్టించగా…
రమ్య రమణీయమైనది శివా హిమనగరము ఎటుచూసినా…
పుణ్యపురమైనది శివా తారలు నిను కొలిచి మెరిసే విను వీధిన…
గగనాన చంద్రుడు చిన్నబోయే శివా…
కైలాసమున మీ దివ్య శోభల కౌముదిని చూసి విస్తుబోయెశివా…
పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా..
రక్షమాం…రక్షమాం..సర్వేశ్వరా.