కలడనుకొని హరుడు…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

కలడనుకొని హరుడు…
కదలి రారండి… వేచి వున్నాడు శివుడు..
ఇవ్వాలని మనకు దీవెనలను…
ఎదురు చూచుచున్నాడు  మనకొరకు రెప్పవాల్చక తన  కరుణ కనులను..!!కల!!

ఇంకేల..ఇంకేల మనకు భయము…
వద్దన్న ఇచ్చునట ఈశ్వరుడు ప్రేమతో అభయము…
మెడలోని నాగన్న ముదమైన పరమేశ్వరుడు…
తన నీడనే పడగగా  చేసి కాపాడగలడు..
కనుక కడలనుకొని హరుడు…
కదలి రారండి వేచి వున్నాడు శివుడు….

దక్షిణ హస్తాన డమరుకము తో అలరారునతడు….
శంఖ నాదముతో మన దుష్ట గ్రహ దోషములను తరిమేయునతడు..
కలతలన్నవి మీకు వలదని…
నమ్మికొలవండి నేను కలనని…
అనునయించునాతడు ఆదిశంకరుడు…
అమ్మలా, నాన్నలా ప్రేమించు అర్ధనారీశ్వరుడు…
కనుక కడలనుకొని హరుడు…
కదలి రారండి వేచి వున్నాడు శివుడు

పాహిమామ్..పాహిమాం… శివశంకరా…పాహిమాం…
రక్షమాం….రక్షమాం…అభయంకరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top