ఓమ్ నమ:శ్శివాయనమ:


ధన్యులైనవి శంకరా..దర్శించుకొని నిను కోట్ల కనులు ఏళ్ల తరబడి…
అయినా తగ్గనీయ్యవు కదా హర హరా మాపై..
ఏ కాస్త కూడా నీ ప్రేమ ఒరవడి…
!!ధన్యు!!
బంధించెదవు…నిరాకారా నీ హృదయ కారాగారములో మము బందీలుగ చేసి…
విధించెదవు విశ్వేశ్వరా…మాకు విడుదలన్నదే లేని శిక్షలెన్నో వేసి…
!!ధన్యు!!
దిక్కులను అంబరములుగ చేసుకొన్న దిగంబరా…
మా మొక్కులన్నీ తీసుకొని మము దీవించరా…
పన్నగాభరణ పార్వతీ పరమేశ్వరా..
ఆపన్న హస్తమై ఆదుకొన అరుదెంచరా హరహరా…
సకలమూ నువ్వు ఎరుగు వాడివి..
సకల శుభములనివ్వరా…
కకావికలమైన మనసులెరిగి..కామితార్థము నివ్వరా…
పాహిమామ్…పాహిమామ్..పరమేశ్వరా పాహిమామ్..
రక్షమామ్…రక్షమామ్..సర్వేశ్