శివా…. ఇమ్మనుచు అడగవా నా హృదయము….
నిన్ను పూజించ కోరవా ఓ బిల్వము…
హరా…తెమ్మనుచు తెలుపవా పుట్ట తేనే….
నన్ను అర్పించుకొననివ్వవా నీకు నన్ను నేనే….
ప్రాధేయ పడుతున్నాను పరమేశ్వరా….
నీ భవదీయుడకు వరమియ్యవా సర్వేశ్వరా…….!!శివా!!
వేడుకుంటానయ్యా రేయి పవలు…
నిన్ను తలచుకుంటానయ్యా భువిన ఉన్ననాళ్ళు….
చేసుకుంటానయ్య నీ పాద సేవలు…
నిన్ను కొలుచుకుంటానయ్యా ప్రాణమున్ననాళ్లు….
నా ఊపిరే నీవైన జగదీశ్వరా….
అడగవే హృదయమును కాళేశ్వరా…!!శివా!!
తల్లివైనా నీవే తండ్రివైనా నీవే….
హితుడవైనా నీవే ఆప్తుడైనా నీవే…
అర్పించుకొననివ్వు నన్ను నీకు….
సమర్పించుకొననివ్వు నా మనసు నీకు….
పరిపూర్ణ భక్తితో ప్రార్ధించుచుంటిని….
ఆర్ద్రత నిండిన నయనాలతో నిన్ను అర్థించుచుంటిని….!!శివా!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం….రక్షమాం…రక్ష మాం…సర్వేశ్వరా రక్షమాం…