లోకాలనేలేటి కాశీపతి….
నీవే కదా శివా మా అధిపతి…
హృదయాల కొలువైన గౌరీ పతి…
నీ ప్రసాదమే ఈ జన్మ హిమపుత్రీ పతి…
కరుణించమని నేను కరములను చాపితి….
దీవించమని నేను హారతులనిచ్చితి…!! లోకా!!
రారాజు వయ్యా మూడు జగములకు…
దొరగారివయ్యా నీవు మా పార్వతమ్మకు…
కన్నతండ్రివయ్య కోట్ల జన్మలకు….
మనసున్న మారాజువయ్య నీవు కర్మ జీవులకు…
ఆ ఆశతో బ్రతికేరు తోడు నీవున్నావనీ….
అదే విశ్వాసముతో గడిపేరు తమ జీవితములని…!!లోకా!!
ఆపదలలో ఆదుకుంటావనీ….
చినపాటి చింతలను కూడా దరికి రానివ్వవనీ…
ఏ స్థితిలో ఉన్ననూ చేయి చాపేవనీ ….
ఏ పాటి కష్టములనైనా పారద్రోలేవనీ…
అసమాన ధైర్యం అవని నందరికీ…
నీపైన అత్యంత నమ్మకం లోకమంతటికీ….!!లోకా!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్షమాం…రక్షమాం..