భగవతీ…శంకరుని శ్రీమతి…
పార్వతీ…పరమేశ్వరుని ప్రియసతి..
అలరారుచున్నావే మము కన్న తల్లివై….
జగమేలుచున్నావే అనురాగవల్లివై…
అంబికా… కావవే సకల లోకములను…
జగదాంబికా అందుకొని నేతి నైవేద్యములను…!!భ!!
ఈశ్వరునిలో సగమువై ఏలుచున్నావు…
పరమేశ్వరునికి ప్రాణమై మసలు చున్నావు…
తల్లి ప్రేమను నీవు చూపుతున్నావు…
మేము తల్లడిల్లితే నీవు తట్టుకోలేకున్నావు…
వెలకట్టగలమా నీ ప్రేమని అమ్మనాయమ్మా….
నీకు గుడి కట్టగలవారమే మా తల్లి కనక దుర్గమ్మా…!!భ!!
చిరునవ్వుతో చింతలను తీర్చుచున్నావు….
నీ కనుచూపుతో కలతలను బాపు చున్నావు…
నగుమోముతో వెలుగులను పంచుచున్నావు….
నీ కరములతో వరములను ఇచ్చుచున్నావు….
పసిడి పట్టీల పాదాలు అందివ్వుమమ్మా…
పసుపు పారాణి పూసేము దీవించవమ్మా…!!భ!!
పాహిమాం…పాహిమాం..పరమేశ్వరీ పాహిమాం…రక్షమాం…రక్షమాం..