వక్రతుండ గణనాధుడు..
తొలిపూజలకర్హుడు…
ఏక దంత వినాయకుడు…
ఏమడిగిన ఇచ్చునతడు…
శంభో హర శంకరా…పంపవయ్య గణపతిని…
దీవించ జనుల భువిన…అంబాసుత దేవునీ…!!వక్ర!!
మ్రోగిస్తాం డోలు బాజా…
తినిపిస్తాం తీపి కాజ…
కొని తెస్తాం…అరటి పళ్ళు…
అర్పిస్తాం…ద్రాక్ష పళ్ళు…
లంబోదర గణపతి ఆరగిస్తే నిండుగ ..
తిని గంగాధర గణపతి తెగ సంతసిస్తే పండుగ…!!వక్ర!!
ఎలుక నెక్కి వచ్చినావు…
ఎట్లు మోసెనది గణపతి…
అమ్మ నొదిలి వచ్చినావు…
కరుణించి పోవ సిద్ధిపతి…
శంభో హర గణపతి నువ్వొస్తివంటే పండుగ…
మా అంబాసుత గణపతి దీవించుమయ్య నిండుగ…!!వక్ర!!
గణా గణా గణపతి…గం గం గణపతి… శివ గుణా సుగుణ గణపతి…గం గం గణపతి…