కోసుకొస్తి శంకరా..మల్లె పువ్వులు…

కోసుకొస్తి శంకరా..మల్లె పువ్వులు…
తీసుకొస్తి శంకరా…బిల్వదళములు..
ఆనతిస్తే వేసేను మల్లె మాలలు…
చరణాల బిల్వ దళములుంచి చేతు నీదు పూజలు…
శంభో హర శంకరా… ఆనతివ్వు హర హరా…
నమో గంగాధర..నీకు మాల వేయనివ్వు శంకరా…..!! కో!!

నారికేళ పానీయం సంగ్రహించితి…
తేనె.. పట్టు నుండి తీపి తేనె పిండుకొచ్చితి…
ఆవు పాల కడవ నేను తీసుకొచ్చితి…
గంగ జలము బిందె నీకు నేను మోసుకొచ్చితి…
ఆనతిస్తె చేతురా…అభిషేకములు శంకరా…
చేయనిస్తే చాలురా…అర్చనలిక శంకరా…!! కో!!

ఇవ్వ నీకు తెస్తినయ్య పట్టు వస్త్రము…
శివా…వేయ నీకు తెస్తినయా పసిడి జంధ్యము…
వేడుకొనగా నేర్చుకొంటి స్తోత్ర రత్నము…
నైవేద్యముగా నీకివ్వనుంటి తీపి పాయసం…
అనతిస్తే చేతురా…అష్టోత్తరము శంకరా…
చెప్పనిస్తే చాలురా… నమక చమకములను శంకరా…!! కో!!

పాహిమాం…పాహిమాం…శంకరా శివా…రక్ష మాం..రక్ష మాం..హేమాంబరా శివా…

Leave a Comment

Scroll to Top