కైలాస శిఖరాన కొలువున్న సామీ…

కైలాస శిఖరాన కొలువున్న సామీ…
మా కనుల జలములను కనవేమి సామి…
భ్రమరాంబికా పతికి ప్రియమైన సామీ…
మా బ్రతుకు బంగారు కానివ్వు సామి…
వేడుకున్ననూ నీవు పలుకవేమీ…
చరణాలు పట్టుకున్ననూ నీవు ఉలకవేమి…!!కైలాస!!

మౌనముగ నువ్వుంటె నా గుండె బరువవౌ…
పరధ్యానముగ నువ్వుంటె  మనసు చెరువవౌ….
విలపించి విలపించి కనులింకిపోయే….
నిన్ను ప్రార్థించి పూజించి మది మూగబోయే…
కరగదా నీ మనసు ఒక్క క్షణమైనా…
ప్రేమ కలగదా నా పైన  అణుమాత్రమైనా….!!కైలాస!!

ఎన్నెన్ని చేసినా నీ పూజలు…
నేనెనెన్ని చేసినా నీ సేవలు…
కరగకున్నవి గత జన్మ పాపాల శిలలు….
నా వెంట వద్దన్న పడుతుండె ఆ పూర్వ  కర్మలు…
ఊపిరాడని స్థితిలోన నేనుంటి శంకరా….
ఉలుకు పలుకు లేకుండ నువ్వుంటే మాకు  దిక్కెవరురా…!!కైలాస!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్షమాం…రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top