ప్రణవ నాద రూపం…పరమేశ్వరం శివం…
ప్రళయ కాల రుద్రం…మహేశ్వరం శివం….
భూత నాధ దైవం…భీమేశ్వరం శివం…
శంఖు నాద మోదం…ముక్తేశ్వరం శివం…
శివం శివం శివం శివం శంకరం శివం…
హరమ్ హరమ్ హరమ్ మహేశ్వరం హరం…!!ప్రణ!!
కాలగమన నేత కాళేశ్వరం శివం…
విశ్వభక్త సులభా విశ్వేశ్వరం శివం…
సర్వ జగద్రక్ష సర్వేశ్వరం శివం…
సకల ప్రాణి జనక సోమేశ్వరం శివం…
శివం శివం శివం శివం శంకరం శివం…
హరం హరం హరం హరం మహేశ్వరం హరం….!! ప్రణ!!
మూడు కనుల రూపం..మురుడేశ్వరం శివం…
నాగరాజు నేస్తం…నాగేశ్వరం శివం…
ఓంకార రూపం…అమలేశ్వరం శివం..
రామ సేవితాంగ లింగం…రామేశ్వరం శివం…
శివం శివం శివం శివం శంకరం శివం…
హరం హరం హరం హరం మహేశ్వరం హరం…!!ప్రణవ!!
పాహి పాహి శంకరం…పరమ సుగుణ శంకరం…రక్ష రక్ష శంకరం..రక్ష హృదయ శంకరం…