శివుని ప్రతి రూపమే శివలింగము…

శివుని ప్రతి రూపమే శివలింగము…
హరుని ప్రత్యక్ష రూపమే ఈ లింగము….
చేసుకో లింగమును ఆలింగనం…
జంగముడు కలిగించడు భంగములు ఏనాటికిన్…!!శి!!

నిరాకారుడై నిటలాక్షుడు వెలసివున్నా…
సహృదయ భక్తులను తిలకించునన్నా…..
అరూపియై అమరేశుడు అమరియున్నా…
అదృశ్యముగా ఆదరించు గుణము తనదన్నా….
పానవట్టము మీద కూర్చున్న శివునిలా…
తానుండు జగములకు రేపవలు కాపలా…!!శి!!

లింగముపై ధారలా పోయరా గంగ జలము…
శివుని శిరము తడిసేను కైలాసమందు….
ఆ లింగమునకు చేయరా భస్మ లేపనము…
హరుడు భస్మ లేపనముతో మెరయు హిమనగము నందు…
అలా లింగమునకు చేయరా నీ పూజలన్నీ…
తిన్నగా జంగమునికి చేరేను నీ సేవలన్నీ…!!శి!!

పాహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం… రక్షమాం రక్షమాం సర్వేశ్వర రక్ష మాం…

Leave a Comment

Scroll to Top