చేసినాము ఈశా.. నీ పూజ క్రతువులు…

చేసినాము ఈశా.. నీ పూజ క్రతువులు…
వెలిగించినాము ఈశా.. కార్తీక ప్రమిదలు…
మూడు కనుల ఈశా.. మొక్కొంటి శంకరా…
త్రిశూల హస్త ఈశా… శరణంటి శంకరా…
ఈ భక్తజనుల ఘోష వినమంటి శంకరా..!!చేసి!!

తెచ్చినాము ఇష్టమని తుమ్మి పువ్వులు…
మోసుకొచ్చినాము మక్కువని  బిల్వదళములు…
అందుకొనుము శంకరా…ఈ పండ్లు ఫలములు…
మాకివ్వవయ్య శంకరా..నీ పుణ్యఫలములు…
పండించవయ్య  శంకరా…మా నోము ఫలములు…!!చేసి!!

వరములిచ్చుటంటే నీకిష్టమంటగా…
 కరుణించమంటి మంటే ముందుంటవంటగా…
భక్తజనుల బ్రోవ తరలొస్తువంటగా…
ఈ దీన జనుల కావ దిగి వస్తువంటగా…
మమ్ము రేయి పవలు కావ నిదురించవంటగా…!!చేసి!!

పాహి పాహి శంకరా…శివ పాహిమాం భజే…రక్ష రక్ష శంకరా..శివ రక్షమాం..భజే…

Leave a Comment

Scroll to Top