నాగేశ్వరా…నాగచంద్రేశ్వరా…

నాగేశ్వరా…నాగచంద్రేశ్వరా…
కాళేశ్వరా… మహాకాళేశ్వరా…
అపురూపమయ్యా నీ దర్శనం…
పాప పరిహార కారణం నీ వీక్షణం…!!నా!!

కర్పూరమవుతాను హారతుల వేళకి…
కార్తీక దీపమవుతాను నీ ఆలయానికి….
శంఖునవుతాను ప్రణవ నాదానికి…
కాలి మువ్వనవుతాను నీ నాట్య సరళికి….
ఏమవ్వనో శెలవియ్యు పార్వతీశా…
వరమిస్తే ఏదైనా నేనౌత శాంకరీశా…!!నా!!

రుద్రాక్ష నౌతాను కంఠానికి…
పసిడి కడియాన్ని అవుతాను నీ చేతికి…
సుమమునవుతాను నీ పూజకి….
ధూళి నవుతాను నీ పాద స్పర్శకి…
ఏమవ్వనో శెలవియ్యు పార్వతీశా…
వరమిస్తే ఏదైనా నేనౌత శాంకరీశా….!!నా!!

పాహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం… రక్షమామ్ రక్షమాం సర్వేశ్వర రక్షమాం…

Leave a Comment

Scroll to Top