మూడు కన్నుల శంకరా నిను కొలుచుచుంటిని….
ముకుళిత హస్తములతో నేను ప్రార్థించుచుంటిని….
అందెనా నా మనవి గంగాధరా…
నీకు చేరేనా నా పిలుపు శంభో హరా…!!మూడు!!
అందినట్లే ఉన్నాయి నా పిలుపులు..
అందుకే జీవించి ఉన్నాను ఇలన ఇన్నినాళ్ళు….
చేరినట్లే ఉన్నాయి నా పూజలు…
అందుకే నిను తలుచుచున్నాను ముప్పూటలు…
కరుణించుటంటే నీకు ఇష్టమని తెలుసు…
నన్నిలా కరుణించడం భాగ్యమని నాకు మాత్రమే తెలుసు…!!మూడు!!
శివా… ఆరిపోనీ దీపమై నీ చెంతనుండని…
వాడి పోనీ సుమమునై నీ పాదాల చేరనీ….
గంగ ధారనై శిరముపై రేపవలు జారనీ..
కాలి మువ్వనై నీ కదలికల సాక్ష్యాన్ని అవ్వనీ…
అట్లయినా తీర్చనీ నీ ఋణమును…
శివా…నువ్వెట్లైన తీర్చరా ఈ జన్మను…!!మూడు!!
పాహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం ర క్ష మాం…. రక్షమాం సర్వేశ్వర రక్షమాం…