నీలకంఠునికి నిత్య కవితార్చనం…
భ్రమరాంబికా పతికి బిల్వార్చనం…
పార్వతీ హృదయునికి పుష్పార్చనం…
దీన దయాళునికి ధూప దీపార్చనం..
అర్చనం…అర్చనం…గీతార్చనం…
నీలకంఠునికి నిత్య కవితార్చనం…!!నీల!!
శ్రీశైల మల్లన్నకు క్షీరార్చనం…
విశాలాక్షి పతికి గంగార్చనం…
రామలింగేశునికి రాగార్చనం….
కైలాస పశుపతికి పద్యర్చనం…
అర్చనం… అర్చనం… గీతార్చనం…
గరళకంఠునికి నిత్య గీతార్చనం…!!నీ!!
నటరాజ ప్రియునికి నాట్యార్చనం…
హరి ధ్యానమూర్తికి గానార్చనం….
వరమిచ్చు శంభునికి వలువార్చనం…
కరుణించు ఉమాపతికి కలువార్చనం….
అర్చనం… అర్చనం…గీతార్చనం…
గరళకంఠునికి నిత్య గీతార్చనం…!!నీ!!
పాహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం…. రక్షమాం రక్షమాం సర్వేశ్వర రక్షమాం…