నమఃశ్శివాయ శంకరా….
సదా శివాయ హర హరా…
మహా శివాయ శంకరా…
అహో చంద్ర శేఖరా….
శివా..సౌమ్య రూపా.. తొలగించుము బాధలు…
హే హరా ప్రాణ దీపా.. నే వెలిగింతును దివ్వెలు..!! న!!
నిజము చేతువయ్యా మా విన్నపాలను…
నీవు ఋజువుచేతువయ్యా మా నమ్మకాలను…
చేరదీస్తువయ్యా భువి దీనజనులను…
నీవు ఆదరిస్తువయ్యా ప్రియ భక్తజనులను…
చూపేవు కరుణను శరణన్న వారిపై..
కురిపిస్తవు వరములు దిక్కు నీవేనను వారిపై…!! న!!
శంభో హర శంకర అని స్తుతులు చేసెద..
గౌరీ పరమేశ్వర అని జతులు పాడెద…
మనసునందు ఉన్న నీ రూపు చూపెద…
నమఃశ్శివాయ అంటూ నీ స్వరము పలికెద…
భావించుము శంకర నన్ను నీదు భక్తునిగా…
గుడికి రప్పించుము శంకరా నీ చరణాలను తాకగా…!! న!!
పాహిమాం పరమేశ్వర పాహిమాం.. రక్షమాం రక్షమాం సర్వేశ్వర రక్షమాం…