నందివాహనాధీశ నాగేశ్వరా…

నందివాహనాధీశ నాగేశ్వరా…
కలన రావయ్య నాగ చంద్రేశ్వరా….
భృంగి సేవిత శివా భీమేశ్వరా…
నీ కొరకు ఎంత కాలమని చూస్తు సర్వేశ్వరా…
కలనైన నిను గాంచి తరియించనీ…
శివా…తరియించి ఈ జన్మ చాలించనీ…!!నంది!!

కలన రప్పించుకొన నేను పుణ్యాత్ముడను కాను…
నిను కానవలెనన్న నేను ధర్మాత్ముడను కాను…
కామ క్రోధ మద మాశ్చర్యములు మా ఆస్తులై ఉంటే….
ఎట్లు వచ్చేవు నీవు కలన రమ్మంటే…
శివా…పాప పుణ్యముల లెక్కలను కాస్త  పక్కనెట్టి….
మన్నించి…కలన రావయ్య నాపైన దయను చూపెట్టి….!!నంది!!

తపన పడుతోంది ఈ జన్మ నిన్ను కాన….
మదన పడుతోంది మనసు నీకు అంకితము కాన….
నీ కరుణ లేకున్న నిరర్ధకము నా జీవితం….
నీ చూపు పడకున్న నాకు  లేదు భవితవ్యం….
ఈశ్వరా…కాస్తంత చేసి ఉన్నా గతజన్మలో పుణ్యము…
తప్పక కరుణింతువని వేచితిని  నీ రాక కోసము…
రెప్ప వాల్చక నేను ఎదురు చూసేను…
కలన నువ్వొస్తే ఎదురొచ్చి హారతిచ్చేను….!!నంది!!

పాహిమాం..పాహిమాం..పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం…రక్షమాం…సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top