ఒకటే ఒకటే కోరిక….

ఒకటే ఒకటే కోరిక….
నీ చరణములంటితే చాలిక….
మరుజన్మే వలదయ నాకిక…
నీ పద ధూళిని నైతే చాలిక…
ఓ శివ శివ శివ శంకరా…నా మనవిని విని నెరవేర్చరా…
హే గంగాధర అభయంకరా…కన్నుల జలములు తుడవగ తరలిరా…!! ఒకటే!!

ఆపదలను రానియ్యవు…
ఆకలి బాధలు మాకు తెలియనివ్వవు….
సంపదలను సమకూర్చెదవు…
మా సంతోషములను కోరుకుందువు…
కష్టమొచ్చితే కలత చెందేవు…
దిగులు పడితే మా హితుడవయ్యేవు….!!ఒకటే!!

నిను కొలిచిన చాలొక క్షణము…
నీ ప్రేమకు పాత్రులమవుతాము…
నిను ధ్యానించిన ఆ మరుక్షణము…
మోక్షానికి అర్హులమవుతాము…
శరణమన్నచో చేయందిస్తువు….
నిండు మనసుతో దీవించెదవు…
ఓ బిల్వదళ ప్రియ దైవమా…
చెంగల్వ పూల నర్పించమా…!!ఒకటే!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్షమాం…రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top