మాధవా…మధుసూదనా….
అలంకార ప్రియుడా యదునందనా…
గోవిందా…గోపికా రమణా…
ప్రేమామృత నయనాల పద్మ వదనా…
ప్రతి నిముషమూ నా మనసు నిను తలవనీ…
నీ తలపులో నా బ్రతుకు కొనసాగనీ…!!మా!!
నారాయణా…నీ నామామృతమును నను తాగనీ…
కేశవా…సంకీర్తనలతో నిన్ను కీర్తించనీ…
అవిరళముగ అరవిందములతో పూజించనీ…
బహు సరళముగా నీ గానమాలపించనీ…
మైమరచిపోవాలి నీ మాయలో పడి…
తన్మయత్వమును చెందాలి నీ తృష్ణలో పడి…!!మా!!
హరీ…అనగనే మనసు ఆనంద సంద్రం….
మురారీ అనిన ముక్తి కలుగునది తథ్యం…
సకల దేవతలకూ దేవ దేవుడవు నీవు….
అఖిల జగములకూ ఆరాధ్య ప్రేమికుడవు నీవు…
శేషశయనా…పవళించి ఉన్నావు పాల కడలీ పైన…
హరీ… నిదురించరావయ్య మా ఎదలలోన….!!
పాహిమాం…పాహిమాం.. పద్మ లోచన హరీ పాహిమాం…రక్షమాం…రక్ష మాం..సర్వ భూత రక్షయా రక్షమాం…