గజాననా…నీ జననం….

గజాననా…నీ జననం….
మాకయ్యెనోయి ఒక వరం….
కొలుచుకుంటే నీ రూపం….
తప్పించు గడ్డుకాలం….
వరమై పుట్టిన వక్రతుండా….
ఇక నీవేగా మా అండదండ…!! గజా!!

పసుపు ముద్దలో అమరేవు….
ప్రతి శుభకార్యమును జరిపేవు…
పత్రిపూజలే కోరేవు…
పసందు విందులకు మురిసేవు…
ప్రేమగ నిన్నే కొలిచేము….
అనురాగము నీపై చూపేము….!! గజా!!

మాటలకందని అనుభూతి….
నిను చూస్తే కలుగును గణపతి….
పాడినచో ఒక నీ గీతం….
మరిచేము గణా మా గత చరితం…
విఘ్నవినాయక నిజమయ్యా….
నీ చల్లని చూపే ఋజువయ్యా…!! గజా!!

పాహీ…పాహి గణపతీ….
మాం.. పాహీ పాహి గణపతి….
రక్ష రక్షా గణపతి…
శివ రక్షా రక్షా గణపతి….

Leave a Comment

Scroll to Top