ఈశ్వరా…అని పిలిచేను ఎప్పుడైనా…
పరమేశ్వరా…అని తలచేను ఏ క్షణమునైనా….
నమ్మకము నా పిలుపు వింటావని…
కనుల చెమ్మలను తుడిచేందుకు వస్తావని…
నిజమే కదా శివ మానమ్మకం…
అందుకు నిదర్శనమే కదా నిత్య నీ దర్శనం…!!ఈ!!
లేవే కనులందు కన్నీటి చుక్కలు…
ఎదురు రావే ఎలాంటి కష్టనష్టాలు..
రావే మా ముందుకు ఏ ఈతి బాధలు…
చెప్పుకొనలేవే ఎలాంటి కడు దీనగాధలు…
మాయమైపోయేను మాలోని కర్మలు…
బహు దూరమైపోయేను మా పాప ఫలములు….!!ఈ!!
అనవే ఇవ్వనని ఏనాడు వరములు..
మన్నింతువే ఎన్నైనా మాలోని తప్పులు…
చూతువే ఓ కంట మాదైన జీవితం…
కరుణింతువే తుడిచేసి విధిరాత లిఖితం…
నీరు గారేను మా నిట్టూర్పులన్నీ…
నీ పూజ పువ్వులయ్యేను మా మనసులన్నీ…!!ఈ!!
పాహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం… రక్షమాం రక్షమాం సర్వేశ్వర రక్షమాం…