కొమ్మలనడిగా శంకరా…
నీ పూజకు పువ్వులనిమ్మని…
ఆ గోవులనడిగా శంకరా…
నీ సేవకు క్షీరమునిమ్మని…
అడిగినతడువే కొమ్మలు…
ఇచ్చెను పువ్వులు గంపెడు…
నేనడిగిన తడువేగోవులు…
ఇచ్చెను పాలను కడివెడు…
పువ్వైనా, ఏ ప్రాణైనా అర్పించును తమ జీవితం…
నువ్వరమిస్తే తగుననిపిస్తే అవి పాడును మంగళ గీతం…!! కొ!!
అవనిన వెలసిన శంకరా…
ఆధారము నీవే భవహరా…
జనులను కాచే శంకరా…
జవసత్వము నీవే ఈశ్వరా…
ఊపిరి నువ్వై నాలో వుంటివి చాలయ్యా శివశంకర…
నీ పద ధ్యానము చేసి ఋణమును తీర్చే వరమీవా పరమేశ్వరా…!! కొ!!
ఠక్కున పిలుపుకు పలికేవు…
సత్వరముగ సాయము చేసేవు…
చప్పున వరములనిచ్చేవు…
మా మనసున నిన్నే వుంచేవు…
పూజలు, సేవలు తెలియని మాకు సర్వం నీవై పోతివి…
ఏ నాటికి గమ్యం తెలియని వారికి దిక్కై నీవే ఉంటివి…!! కొ!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం..రక్షా మాం…సర్వేశ్వరా రక్ష మాం..