వందే నాగాభరాణా…

వందే నాగాభరాణా…
నమో వందే సుందర వదన…
శంభో పావనచరణా….
నమో..శంభో కరుణల సదన…
ఇన్నాళ్లకు కరుణించావా…. వరమీయ్యగ భువికొచ్చావా…!! వందే!!

కరిగిపోయినా కలలు…
వృధా కావు మా పూజలు..
తరిగి పోయినా  ఆశలు…
చెరిగిపోవు మా సేవలు…
పూజిస్తూనే ఉంటాము నీ దయ పొందే దాకా శంకరా….
మేము ధ్యానిస్తూనే ఉంటాము నిను చేరే దాకా శంకరా…!! వందే!!

కర్మలెంత వెంటాడినా…
వీడము నీ చరణాలను…
పాప భీతి నను కమ్మేనా…
నీవే దిక్కను వాడను….
పరమేశా… ఈ సృష్టికి మూలం ఆది అంతం అన్నీ నీవే శంకరా…
జగదీశా… నీ ప్రేమకు లోకం దాసోహం ఇది సత్యం శంభో శంకర…!! వందే!!

పాహి పాహి పరమేశ…. రక్షా రక్ష జగదీశ…

Leave a Comment

Scroll to Top