వచ్చేవు గణపయ్య చవితికి…

వచ్చేవు గణపయ్య చవితికి…
నీవు తెచ్చేవు వరములను భూమికి…
ఇచ్చేవు దీవెనలను జనులకి…
పొంగిపోయేవు “జై గణేశ” పిలుపుకి….!!వ!!

ఏకదంతా నీ పూజలు చేయనుంటిమి…
ఓ వక్రతుండ కుడుములనందివ్వనుంటిమి….
మహాకాయ నీ పాటలు పాడనుంటిమి…
ఓ శూర్పకర్ణా..నీ సేవలు చేయనుంటిమి…
గణా గణా గంటలు మ్రోగించ నుంటిమి…
ఓ గుణా సుగుణ నిన్నెపుడూ మరువనంటిమి…!!వ!!

శివునితోటి రావయ్యా సిద్ధి గణపతి…
శైల పుత్రితోటి రావయ్యా బాల గణపతి…
షణ్ముఖునితో రావయ్యా క్షేమ గణపతి….
ప్రమథ గణములతో రావయ్యా నాట్య గణపతి….
ఎలుకనెక్కి నాక నీవు మహా గణపతి…
ఏలుతావు లోకాలని శక్తి గణపతి…!! వ!!

పాహిమాం…పాహిమాం…మహా గణపతి… హే రక్షమాం…రక్షమాం…వీర గణపతి….

Leave a Comment

Scroll to Top