ఏకదంత మహాకాయ నీకు వందనం …
శూర్పకర్ణ గణేశాయ శిరసాభివందనం….
వెలసినావు పండగేళ వాడ వాడలా ..
దయ తలచుమయ్య గణపతి ఎల్ల వేళలా….!! ఏక!!
ఇష్టమయ్య గణేశా నీదు పండగ…
ఎంత కష్టమైన తెచ్చేము పత్రి దండిగా…
మాలలేసి కొలిచేము మహా గణేశా…
నీకు కుడుములొండి పెడతాము బొజ్జ గణేశా…
తింటివంటే గణేశా కడుపు నిండుగా…
మాకు అదే కదా గణేశా అసలైన పండగా….!! ఏక!!
ఎలుకనెక్కి తిరుగుతావు మహాకాయుడా…
దానికెంత శక్తి నిచ్చినావు శంభు పుత్రుడా…
అట్లాగే శక్తి నివ్వు విఘ్నేశ్వరుడా….
మమ్ము ఇట్లాగే కరుణించుము వక్రతుండుడా…
చదివినాము వ్రత కథలను నీ చరిత తెలుసుకొనగా ..
మేము చేసినాము నీ పూజలు వరములందుకొనగా…!! ఏక!!
గణనాథా గణనాథా దయను చూపరాదా…
శంభు గణనాథా గణనాథా వరములియ్య రాదా…