భక్తజన సులభా..పార్వతీ వల్లభా…

భక్తజన సులభా..పార్వతీ వల్లభా…
హేమాద్రి శోభా…ప్రేమ గుణ సౌరభా…
సేవింతు శంకరా…ప్రతి ఉదయ సంధ్యన…
నిన్ను  ధ్యానింతు శంకరా..నా మానసమునందున….!!భక్త!!

తెస్తునయ్యా నీకు గంగజల సిరులు..
కోసు కొస్తునయ్యా నీ కొరకు బ్రహ్మ కమలములు…
వస్తునయ్యా నీ గుడికి వేల సార్లు…
మోసుకొస్తునయ్యా నీ కొరకు రుద్రాక్ష ఫలములు…
శంకరా…కావయ్య నాకవి కష్టతరము…
ఈశ్వరా.. .నీ దయ ఉన్న నాకవి బహు సులభతరము..!!భక్త!!

శివా… నీ పాద ధూళి నన్నవ్వని..
హరా…నీ చరణాల సుమమునన్నవని…
శంకరా.. నీ చేతి ఢమరుకము నేనవ్వని…
ఈశ్వరా..నీ కాలి అందియను నేనవ్వనీ…
ఏది నేనైనను అది నీ బిక్ష ఫలితమే…
నేనేదియూ కానిచో…శివా…అది నా కర్మ ఫలితమే…!!భక్త!!

పాహిమాం పాహిమాం పరమేశ్వరా.. పాహిమాం… రక్షమాం రక్షమాం సర్వేశ్వరా రక్షమాం..

Leave a Comment

Scroll to Top