నమ:శ్శివాయ… నమ:శ్శివాయ…అని స్మరిస్తూనే ఉండనీ…

నమ:శ్శివాయ… నమ:శ్శివాయ…అని స్మరిస్తూనే ఉండనీ…
శంకరా…ఆ పదము నా నాల్కపై నాట్యమాడుతూనే ఉండనీ…
శివా…ఇదే నేను నిన్ను అడుగు వరము…
ఓ హరా… నాకిదే నిను చేరు సరియైన మార్గము…!!నమ:!!

అవకాశమీవయ్య శివ శంకర…
అర్పింతు నా మనసు పరమేశ్వర…
ఆలంబనవుమయ్య గంగాధర…
సదా సేవించ నిను నేను గౌరీవరా..
దాహార్తినై ఉంటిని నీ కరుణకై….
శివా…దర్శించనిలుచుంటి నీ రాకకై…!!నమః!!

అలసింది నా మనసు కొలిచి కొలిచి…
కనుల ఒలికింది కన్నీరు తలచి తలచి…
హృదయ కోవెల యందు కూర్చొనుము శంకరా…..
నా మనసు మందిరము నందు నడయాడు ఈశ్వరా…
ఏకధాటిగా చేసేను  నీ పూజలు….
సురులకు ధీటుగా చేసేను నీ సేవలు…!!నమ:!!

పాహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం…. రక్షమాం రక్షమాం సర్వేశ్వర రక్షమాం…

Leave a Comment

Scroll to Top