హే శంకరా…అడ్డ నామాలతో నీవు అలరారుచుంటివి…

హే శంకరా…అడ్డ నామాలతో నీవు అలరారుచుంటివి…
ఆ నాగపడిగ బొట్టయ్యి ముదమవ్వుచుంటివి…
నాగరాజే నీకు కర్ణ కుండలమాయే…
తను చేయు పూజలే మాకు ఆదర్శమాయే…!! హే..శంకర!!

శంకరా… నిలిచిపో నీవు  మా మనసులో…
ఈశ్వరా…నేను నిను కనిన మరు క్షణములో…
గంగాధరా…అందుకో నా చేతిని….
హే శశిధరా…వదిలిపెట్టకు చేయి.. కర్మలలో మునిగి ఉన్నానని…
కరుణామయునువై కరుణ సంద్రాన  తేలనిస్తే…
జన్మదాసోహమవ్వదా ఓం నమశ్శివాయ మంత్రాలు పలకనిస్తే…!! హే శంకరా!!

వేల హారతులతో నేను నీ పూజ చేసినా…
కోట్ల మంత్రాల శబ్దాలతో నిను నేను శ్లాఘించినా…
తక్కువే నీకు నిను నేను పొగడ…
బహు తక్కువే విరచించ  సౌందర్యములను కూడా…
భక్తి భావనతో నీ గీతాలు వ్రాయగలనయ్యా…
అక్షరాక్షతలతో అభిషేకములు చేయగలమయ్య… !! హే శంకరా..!!

పాహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం…. రక్షమాం రక్షమాం సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top