మేలి కనకపు ఛాయగల మాహేశ్వరా…
కలి మాయ ముసుగులను తొలగించ రావేమిరా….
నీలి మబ్బులను శాసించు శివ శంకర…
కర్మ కరిమబ్బుల నుండి మమ్ము తప్పించరా…
హే చంద్ర చూడా శివా..పాహిమాం… పాహిమాం…
త్రిశూలాగ్ని నేత్రా హరా… రక్షమాం రక్షమాం…!! మేలి!!
పలికేను నా మనసు ఓంకార నాదం…
అది రాసేను ప్రతిరోజు నీ భక్తి గీతం…
అక్షరాక్షతలతో నేను నిను కొలుచు చుంటి…
భక్తి పద కవితలల్లి నీ పాదాల ఉంచుతుంటి…
ఈశ్వరా..సారించు నీ దృష్టి నా కవితపై…
పరమేశ్వరా…ముద్రించు నీ రూపు నా మనసుపై…!! మేలి!!
పగలురేయే తెలియని వరము నాకివ్వు….
రేయి పగలూ నిను తలచు భాగ్యమివ్వు….
ఎండ వానల సంగతి ఎరుగనీకుండా…
వెంట రానీ వాటిపై మనసు మరలకుండా….
తాపసినివనీ నన్ను త్రినేత్రుడా….
నీ చరణ దాసుడవుని నన్ను చంద్రశేఖరుడా…!! మేలి!!
పాహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం… రక్షమాం రక్షమాం సర్వేశ్వరా రక్షమాం….