జయ జయ జయ హనుమా…

జయ జయ జయ హనుమా…
శ్రీ రామదూత శ్రీ హనుమా..
జయ మంగళమయ్యా హనుమా…
నీ సాటి ఎవరయా హనుమా…
రామ నామ ప్రియ హనుమా…
కోదండ రామ మది హనుమా..!!జయ!!

సంద్రమునే దాటావు హనుమా…
దాటి లంకను కాల్చావు వీర హనుమా…
జానకినే కనుగొంటివి హనుమా…
రాముని జ్ఞాపికనందిస్తివి సుగుణ హనుమా..
ఉత్తమోత్తమైన భక్త హనుమా…
రామాయణ చరిత లోన నిలిచినావు హనుమా…!!జయ!!

స్వామి భక్తి  నీదేరా హనుమా…
విశ్వాసమంటే నీదేరా హనుమా…
భక్తుడంటే నువ్వేరా హనుమా…
నిజ భక్తికి సాక్ష్యమంటే నీవేరా హనుమా…
ఉత్తమోత్తమైన భక్త హనుమా…
నిన్ను పొగడ తగను నేను ధీర హనుమా…!!,జయ!!

పాహిమాం పాహిమాం శ్రీ ఆంజనేయ స్వామి పాహిమాం.. రక్ష  మాం..రక్షమాం.. వీరాంజనేయ స్వామి రక్షమాం…

Leave a Comment

Scroll to Top