మూడు కన్నుల వాడా కదలి రావయ్యా…
ముక్కంటి మా మొరలు వినగరావయ్యా…
వెండి కొండల వాడా వేగరావయ్యా…
వేసారి ఉన్నాము ఓదార్చ తరలిరావయ్యా…!!మూడు!!
రవిచంద్రులే నీకు కన్నులాయే….
ఆ ఇద్దరే మాకు వెలుగులాయే…
నాగరాజు నీకు ఆభరణమాయే….
నాగదేవతై ఇలన దైవమాయే….
ఇలా కరుణించుచున్నావు ఈ జగతిని…
అట్లాగే దయ తలచి దీవించు ఈ దీనుని…!!మూడు!!
నీకు తెచ్చేను పుష్పాలు కోకొల్లలు…
కోసుకొచ్చేను మారేడు దళరెమ్మలు…
చేసేను పూజలను అతి శ్రద్ధతో…
శివా.. నా కథను వినవయ్య కడు ప్రేమతో….
విన్నాక తీర్చేవు నా కోర్కెను…
దాటి రమ్మంటూ పిలిచేవు నీ గుడి గడపను…!!మూడు!!
పాహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం.. రక్షమాం రక్షమాం సర్వేశ్వర రక్షమాం..