మోదక హస్తా గణనాథా…

మోదక హస్తా గణనాథా…
మా ప్రార్థన కాస్త వినరాదా….
శంభుని పుత్రా గణనాథా….
నీ పూజను చేసితి కనరాదా…
గణ గణ గణ గణ గణనాథా…
గణములకధిపతి దేవా గణనాథా…!! మో!!

అదిగో తెస్తిని లడ్డులని…
నువు తినరా త్వరగా అన్నిటినీ…
ఇదిగో పెట్టితి కుడుములని…
తిని ఒసగుము మాకు వరములని…
గణ గణ గణ గణ గణనాథా…
గంగాధర ప్రియసుత గణనాథా…!!మో!!

వేసేమయ్యా చిందులను…
అర్పిస్తూ నీకు విందులను….
పాడేమయ్యా పాటలను…
వినిపిస్తూ పార్వతి సుద్ధులను…
గణ గణ గణ గణ గణనాథా…
అంబాసుత గజముఖ గణనాథా…!!మో!!

పాహి పాహి గణానథా…మాం  పాహీ పాహీ గణ నాథా…

Leave a Comment

Scroll to Top