నారాయణీ…పుణ్య సాధ్వీమణీ…
మృదుభాషిణి…నిత్య సంతోషిణి..
ఏలవే మా తల్లి ఏడు లోకములు…
పాలించవే తల్లి పద్నాల్గు భువనాలు…
ఎవ్వరే జననీ నీకు సరిసాటి…
నీ నిత్య పూజలే పావని మాకు పరిపాటి…!!నా!!
లలిత లావణ్య సౌందర్య లయకారిణి…
శివుని మనసందు నివసించు విదుషీమణి…
నాననీ నా నాల్కపై నీ అష్టోత్తరం…
నను చేయనీ నీ రచనల గీత యాగం…
చండికా…ప్రతి సంధ్య నీ వెలుగులాయే…
అంబికా…ఆ వెలుగులే మా జీవన వనరులాయే…!!నా!!
పసుపు కుంకుమల రాశులతో పూజించనా…
కోటి మల్లెల దండలను నీకు అల్లించనా…
ఆది ముత్తైదువై నీవు వెలుగు లీనమ్మా…
సృష్టి పెద్దమ్మవై నీవు దీవించవమ్మా…
శాంకరీ…నీ కాలి పట్టీల మవమా….
ఈశ్వరీ…నీ జడ పాయలో పూల మవమా…!!నా!!
పాహిమాం…పాహిమాం ..పరమేశ్వరీ పాహిమాం…రక్ష మాం…రక్ష మాం…సర్వేశ్వ రీ రక్ష మాం..