శంఖు నాద ప్రియునికి వందనాలు….

శంఖు నాద ప్రియునికి వందనాలు….
శంభు దేవునికి భక్తితో గంట నాదాలు…
వినిపించెదము వినయముతో విశ్వనాథునికి…
మనము తెలిపెదము మన వినతి పరమేశ్వరునికి…
అందుకొమ్మని ప్రేమతో మన పూజలు….
ఆదుకొమ్మని దయతోడ మన బ్రతుకులు….!!శంఖు!!

వినగలడు శంకరుడు విన్నపములు…
మనసు వుంచగలడు మన పైన రేయి పవలు…
కనగలడు ఈశ్వరుడు మన జీవితాలు….
కరుణించగలడు కాకుండ కష్టాల పాలు…
విశ్రమించడు శివుడు క్షణము కూడా…
తాను నిష్క్రమించడు అపన్నులను ఆదుకొనకుండా…!!శంఖు!!

తల్లి పార్వతీ శివునికి సహకరించు…
ఆర్తులను కాపాడమని మనపైన ప్రేమ చూపించు…
ఆది దంపతులిద్దరూ ఆదుకుంటుంటే…
శివ పార్వతులు ఇద్దరూ అండగా వుంటే…
ఏ ముప్పు మనకొచ్చు భవిష్యత్తులో…
ఇది సత్యమౌ చూడు వర్తమానములో….!!శంఖు!!

పాహిమాం…పాహిమాం… పరమేశ్వరా…పాహిమాం…
రక్ష మాం…రక్షమాం సర్వేశ్వరా రక్ష మాం..

Leave a Comment

Scroll to Top