కాళి వైన నీవే కాత్యాయనీ…

కాళి వైన నీవే కాత్యాయనీ…
వరలక్ష్మి వైన నీవే వరదాయినీ…
శార్వాణి వైన నీవే శుభ దాయినీ…
ముగురమ్మల మూలకూటమ్మావే మృధుభాషిణి…!! కాళి!!

హే చండికా…చందనాలంకృత సేవలను అందుకొనవమ్మ….
శ్రీ స్వరాత్మికా…స్వర సంకీర్తనల గానాలలో ఓలలాడుమమ్మా…
పంచ భూతాత్మికా…పంచామృత అభిషేకములలో తేలియాడమ్మా…
మహాకాళీ…మహాలక్ష్మీ…మహా సరస్వతీ…మంగళ హారతులను ముదముగా గైకొనుముమమ్మా…!!కాళి!!

త్రిపుర సుందరీ…త్రిలోక సంచరీ…
త్రిశూలధరీ…త్రికాల మంజరీ…
నీ పాదాక్రాంతమే కదా…పంచ భూతాలు సైతము…
నీ ఆజ్ఞ పాలించుటే కదా అష్ట దిక్పాలకుల లక్ష్యం…
అమ్మా…జననీ…కనుచూపుతో కాచేవు ఎల్ల లోకములు…
తల్లీ…పావనీ…నీ చిరునగవుతో తడిపేవు మా హృదయ సీమలు…!!కాళి!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరీ పాహిమాం…రక్ష మాం…రక్షమాం…రాజ రాజేశ్వరీ రక్షమాం…

Leave a Comment

Scroll to Top